English   

పూరీకి అనుకోని షాక్....ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ లీక్

puri
2019-06-08 12:27:36

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ ల కాంబినేషనల్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీలయినంత త్వరగా ఈ సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్ చేయాలనే తొందరలో ఉన్న పూరీ జగన్నాధ్ కి కొత్త చిక్కు వచ్చిపడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా స్క్రిప్ట్ ను మురళీకృష్ణ అనే వ్యక్తి  బజ్ బాస్కెట్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే ఈ విషయం మీద పూరీ టీం ఆయనను సంప్రదించగా స్క్రిప్ట్ తెసేయాడానికి ఆయన భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ ప్రతినిధి రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రవి ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సినిమా టాకీపార్ట్‌ షూటింగ్ పూర్తయిందట. ఈ విషయాన్ని ప్రకటించిన సినిమా యూనిట్ ఇంకా నాలుగు పాటల షూట్ మాత్రమే మిగిలి వుంది. ఇక ఈ నెల 15న రామ్‌ పుట్టినరోజు సంద ర్భంగా సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం  అందిస్తున్న ఈ సినిమాలోని దిమాక్‌ఖ‌రాబ్ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని నిన్ననే విడుద‌ల చేశారు. ఆ పాత విపరీతంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.

More Related Stories