English   

వేశ్య పాత్ర చేసేందుకు సిద్దమయిన బోల్డ్ బ్యూటీ

payal
2019-06-08 12:40:35

ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో వస్తున్న హీరోయిన్లు మంచి జోరు కొనసాగిస్తున్నారు. ఒక్క సినిమా హిట్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు గా మారిపోతున్నారు. తాజాగా వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్స్ 100’ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన పాయల్ రాజ్ పుత్ వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకెళుతుంది. వరుస ఆఫర్స్ వస్తున్నా ఆమె అన్నీ ఒప్పుకోక తన కెరీర్ కి ఇది ఉపయోగపడుతుంది అంటేనే చేస్తూ పోతోంది. ఈ మధ్య రిలీజ్ అయిన సీత సినిమా కోసం ఐటెం గార్ల్ అవతారమెత్తిన పాయల్ రాజ్‌పుత్ మరోపక్క ఆర్డీఎక్స్ ల‌వ్‌ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ సినిమా చేస్తోంది. సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భాను శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. అంతేకాక వెంకీ మామ సినిమాలో వెంకటేష్ సరసన కూడా క‌థానాయిక‌గా న‌టిస్తుంది పాయ‌ల్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం పాయ‌ల్ ఎవరూ చేయడనికి ఒప్పుకొని ఒక రోల్ చేయాలని భావిస్తోందట. అదేంటంటే వేశ్య పాత్ర,, నిజానికి ఇలాంటి పాత్రలు చేయడానికి అప్ కమింగ్ హీరోయిన్స్ ఆలోచిస్తారు, కానీ ఆమె ఏమీ సంశయం లేకుండా ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్క‌నున్న‌ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బ‌యోపిక్ లో ఆమె ఈ వేశ్య పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు. చిత్రంలో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు పాత్రని బెల్లంకొండ శ్రీనివాస్ పోషించనున్నట్టు సమాచారం. ఆగ‌స్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు స‌మాచారం. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం దొంగగా చాలా మందిని వ‌ణికించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌రావు బ‌యోపిక్ ప్రేక్ష‌కుల‌ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories