English   

షూట్ పూర్తి చేసుకున్న సాహో...స్టోరీ అదేనట ?

saaho
2019-06-08 13:09:36

బాహుబ‌లి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యాక ప్ర‌భాస్ నటిస్తున్న సినిమా సాహో. దీంతో ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు సహా యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎదురు చూస్తోంది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి కధ ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రచారం జరుగుతోన్న కధ ప్రకారం ప్రభాస్ ఒక నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో విలన్ ఒక అండర్ వరల్డ్ డాన్ కావడంతో అతన్ని అంత మొన్చించేందుకు ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. ఆ డాన్ అనుచరులు అందరినీ ఒక్కొక్కరిగా చంపుతూ వస్తాడు. అలా ఎందుకు చంపాల్సి వస్తుంది అనే విషయాన్ని ఫ్లాష్ బాక్ లో హీరో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులని డాన్ హత్య చేసినట్టు చూపిస్తాడు. అందుకే వారి మీద పగ తీర్చుకోడానికే కునేందుకే హీరో నకిలీ ఇంటర్ పోల్ అధికారిగా మారతాడట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్ నితిన్ ముకేశ్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గ‌త వారం రోజులుగా హైద‌రాబాద్‌లోని రామోజీఫిలిం సిటీలో జ‌రుపుకుంది. చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అయింద‌ని తెలుస్తుండ‌గా, ఈ నెల 9 నుండి అన్న‌పూర్ణ స్టూడియోలో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌పనున్న‌ట్టు స‌మాచారం. ఇక వచ్చే నెలలో టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌ర‌ప‌నున్నారట.  

 

More Related Stories