English   

వాడు నన్ను అక్కడ తాకాడు...కంగనా సంచనలం

kangana
2019-06-08 13:54:41

ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి కుండ బద్దలు కొట్టడంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ది అందె వేసిన చేయి. ఈ మధ్య కాలంలో మీటూ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆమె తాజాగా మళ్ళీ సంచలన వాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి హాజరైన కంగనా రనౌత్ మాట్లాడుతూ తనకు చిన్న తనంలో ఎదురైనటువంటి ఒక చేదు అనుభవాన్ని ఆ కార్యక్రమంలో పంచుకున్నారు. నిజానికి బాలీవుడ్ సినిమాలు సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనే విషయం మీద చర్చించగా ఈ షోలో పాల్గొన్న కంగనా ఆమె స్కూల్ డేస్ ను గుర్తుకు తెచ్చుకొని కంట తడి పెట్టింది. ఆమె స్కూల్‌కు వెళుతున్న రోజుల్లో ఒక బైకర్ వల్ల ఎదుర్కొన్న ఈవ్ టీజింగ్ గురించి వెల్లడించింది. తను చండీఘర్ పాఠశాలలో చదువుతున్నప్పుడు అబ్బాయిలు బైక్ లపై వెళ్తూ అమ్మాయిలను తాకడానికి ప్రయత్నించేవారని ఒకసారి అలాగే ఒక బైకర్ చాలా వేగంగా తన వైపుకి వచ్చి తన ఛాతీపై గట్టిగా కొట్టాడని, ఆ హఠాత్పరిణామానికి షాకైన తాను 5 నిమిషాల వరకు తేరుకోలేకపోయానని, కానీ తేరుకోగానే వచ్చిన మొదటి ఆలోచన ఇలా చేయడం ఎవరైనా చూశారా ? అంటూ కంగనా తన ఈవ్ టీజింగ్ ఘటనను చెప్పుకొచ్చింది.  ఈ కార్యక్రమానికి కంగనా తో పాటు దీపికా పదుకొనే, పరిణీతి చోప్రా కూడా హాజరయ్యారు కంగనా మాటలు విన్న పరిణీతి ఇలాంటి సందర్భంలో జనాలు అమ్మాయేదో తప్పు చేసినట్టుగా ఆలోచిస్తారని అన్నారు.  

 

More Related Stories