English   

నా సినిమా పోయింది...నిజాయితీగా ఒప్పుకున్న సూర్య

suriya
2019-06-08 14:09:04

సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఎన్జీకే గత నెల 31వ తేదీన విడుదలైంది. ఏడాది పాటు వాయిదా పడుతూ పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులని ఎంగేజ్ చేయలేకపోయింది. తెలుగులో అంటే సరే కానీ తమిళంలో కూడా క‌నీస ఓపెనింగ్స్ లేకుండా పోయింది ఈ సినిమా. ఒక‌ప్పుడు అద్బుత‌మైన సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిల్చిన  చేసిన సెల్వ‌ ఇప్పుడు ఇలాంటి సినిమా సూర్యతో చేయించడంతో అభిమానులు చాలా నిరాశ ప‌డుతున్నారు.  దాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ చేసిన సినిమా కావడంతో, అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా అసలు ఆకట్టుకొక పోవడంతో సూర్య తన సినిమా మీద స్పందించాడు. ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకొక పోవడంతో ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌క‌నే సారీ చెప్పాడు సూర్య‌. ఎన్జీకే చిత్రంపై మీరు అందించిన అభిప్రాయాలని.. ప్రేమని.. ఆలోచనలని ఓ గౌరవంగా స్వీకరిస్తున్నాని విమర్శకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. త‌న సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోకుండానే పరోక్షంగా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌ని ఇక నుండి మంచి సినిమాలు చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు సూర్య. తన సినిమా ఫ్లాప్ అయిందని నిజాయితీగా ఒప్పుకున్న సూర్యని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

 

More Related Stories