English   

పెనుప్రమాదం నుండి తప్పించుకున్న హీరోయిన్

kavi
2019-06-08 14:44:00

నిత్యం మనం ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉంటాం. కానీ అవేవీ పెద్ద వార్తలుగా నిలవవు, కానీ ఎవరయినా సెలెబ్రిటీకి జరిగితే మాత్రం అదో పెద్ద న్యూస్ అవుతుంది. తాజాగా అలాగే మలయాళ నటి అర్చనా కవి పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయట పడి ప్రాణాలు దక్కించుకుంది. కేరళ రాజధాని కొచ్చిలో ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఒక్కసారిగా మెట్రో శ్లాబ్ కాంక్రీట్ పెళ్లలు ఊడిపడ్డాయి. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.  అయితే అదృష్టవశాత్తు కారులోని వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆమె సహా కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి అర్చన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో తప్పించుకున్నట్టు ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొంది. విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైందని, కారు డ్రైవర్‌కు పరిహారం ఇవ్వాలంటూ మెట్రో అధికారులు, పోలీసులను కోరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అర్చన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ అనే తెలుగు సినిమాలో నటించింది.

More Related Stories