English   

దేవరకొండా...బుల్లికొండని పట్టించుకోక పోతే ఎలా ?

vijay
2019-06-08 15:16:57

తెలుగు హీరోలలో ఈరోజు ఉన్న క్రేజీ స్టార్స్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ అంటూ లేకుండా ఎంటర్ అయ్యి, ఈరోజు సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి టార్గెట్ అయ్యాడు. దానికి కారణం దొరసాని సినిమా. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో పరిచయమవుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే తమ్ముడి సినిమా గురించి కానీ, తమ్ముడి సినియా ట్రైలర్ గురించి కానీ ఆయన ఏమీ స్పందించలేదు. కానీ నిన్న 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ ని విజయ్ దేవరకొండ రిలీజ్ చేయడమే కాక తన సోషల్ మీడియా అకౌంట్ల నుండో షేర్ చేశాడు. నిజానికి దొరసాని టీజర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. టీజర్ లో ఆనంద్ దేవరకొండ లుక్స్, అతడి నటన మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ తో పోల్చి ఆయనే బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ బుల్లి కొండ ఇండస్ట్రీలో ఏమేరకు నిలదొక్కుకుంటాడనే సందేహాలు కలుగుతుండగా విజయ్ మాత్రం తమ్ముడి సినిమా విషయంలో సైలెంట్ గా వుండిపోయి, వేరే వారి సినిమాను ప్రమోట్ చేయడంతో విజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి టార్గెట్ అవుతున్నాడు.

More Related Stories