English   

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌హేశ్ బాబు.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి..

mb
2019-06-08 20:23:23

ఒక్క ఇండియాలోనే కాదు.. ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం క్రికెట్ ఫీవ‌ర్ న‌డుస్తుంది. గ‌తంతో పోలిస్తే ఈ సారి కాస్త త‌క్కువ‌గానే వ‌ర‌ల్డ్ కప్ హంగామా ఉంది కానీ ఇండియా వ‌చ్చిన త‌ర్వాత మాత్రం క్రేజ్ పీక్స్ కు చేరిపోయింది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. మిగిలిన మ్యాచుల ప‌రిస్థితి ఎలా ఉన్నా కూడా ఇండియ‌న్ మ్యాచ్ ల‌కు మాత్రం ఇమేజ్ మ‌రోలా ఉంటుంది. జూన్ 9న ఇండియా త‌న రెండో మ్యాచ్ ఆడ‌బోతుంది. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌బోయే ఈ మ్యాచ్ పై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్ప‌టికే టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండో ఆసీస్ మ్యాచ్ కు మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది. ఈ సారి మ్యాచ్ చూడానికి తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి వెంక‌టేశ్ లాంటి హీరోల‌తో పాటు మ‌హేశ్ బాబు కూడా వెళ్తున్నాడు. ప్ర‌స్తుతం టూర్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో.. కుటుంబంతో పాటు లండ‌న్ వెళ్ల‌నున్నాడు.
అక్క‌డే ఉండి జూన్ 9న జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ చూసి తిరిగి ఇండియా రానున్నాడు. జూన్ 10న ఈయ‌న రిట‌ర్న్ జ‌ర్నీ ఉంది. వ‌చ్చీ రాగానే అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు. ఇప్ప‌టికే స‌రిలేరు నీకెవ్వ‌రు టీం మ‌హేశ్ బాబు కోసం ఏచి వేచి చూస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అంటే కేవ‌లం ఆర్నెళ్ల‌లోనే షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు అనిల్. దాన్నిబ‌ట్టే మ‌హేశ్ కూడా ఇక‌పై ఎలాంటి టూర్స్ లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మ‌హ‌ర్షి త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో స‌రిలేరు నీకెవ్వ‌రుపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. దిల్ రాజుతో క‌లిసి అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

More Related Stories