English   

గోపీ చంద్ సినిమాకి ఇంటరెస్టింగ్ టైటిల్...ఎక్స్క్లూజివ్

gopi
2019-06-08 21:48:09

గోపీచంద్‌ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా వచ్చే ఈ ఏడాది మేలోనే రిలీజ్ చేయాలని భావించినా మధ్యలో ఒక యాక్షన్ సీక్వేస్ లో ఆక్సిడెంట్ జరగగా ఆయన చాలా కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక అంతా సెట్ అవడంతో ఆయన షూట్ లో పాల్గొనడంతో సినిమా రిలీజ్ కి దగ్గరవుతోంది. దీంతో ఈ సినిమాకి పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ ని పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 1993 వచ్చిన బంగారాబుల్లోడు సినిమా టైటిల్ ని గోపీచంద్ తాజా సినిమాకి పెట్టాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అయితే మాకు ఎక్స్క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి చాణక్య అనే టైటిల్ పెడుతున్నారట. ఈ విషయన్ని రేపు అధికారికంగా ప్రకటించనుంది సినిమా యూనిట్. ఈ మూవీ టైటిల్ ని రేపు ఉదయం 11:34 లని అధికారికంగా ప్రకటించనున్నారు.

More Related Stories