English   

సునీల్ నే ఫైనల్ చేశారా ?

sunil
2019-06-08 22:01:20

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత చాలా రోజులు సినిమాలే చేయలేదు. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకొని రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాలు వ‌రుస‌గా రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమాలో రాజా ది గ్రేట్ సినిమా తప్ప మిగతా సినిమాలు అన్నీ దెబ్బ వేశాయి. దీంతో మళ్ళీ గ్యాప్ తీసుకుని ఆయన విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లో జ‌రుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆయన సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్ర కోసం అల్లరి నరేశ్ ను తీసుకోనున్నట్టుగా రెండు రోజులుగా ప్రచారం జరిగింది. మహర్షిలో అల్లరి నరేశ్ పాత్రకి ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమా కోసం ఆయనని తీసుకోవాలని భావించినా చివరికి సునీల్ ని ఫైనల్ చేసిందట సినిమా యూనిట్. ఇక ఈ సినిమా త‌ర్వాత రవితేజ మ‌రోసారి గోపి చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ లో వచ్చిన డాన్ శీను, బ‌లుపు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. 

More Related Stories