English   

సాహోపై లేనిపోని అనుమానాలు.. సుజీత్‌పై అంత న‌మ్మ‌కం స‌రైందేనా..?

saaho
2019-06-08 22:26:12

ఇప్పుడు సాహో సినిమాకు పెడుతున్న బ‌డ్జెట్.. అక్క‌డ జ‌రుగుతున్న తీరు చూస్తుంటే అంతా ఇదే అనుకుంటున్నారు. ఒక్క దుబాయ్ షెడ్యూల్ కే ఏకంగా 90 కోట్లు ఖ‌ర్చు చేసారు. అలాంటి స‌న్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. అంత‌గా ఓ క‌థ‌ను న‌మ్మి కోట్ల‌ను మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు పెడుతున్నారు. ఇదంతా చూసిన త‌ర్వాత ఎవ్వ‌రికైనా ఇదే అనుమానం వ‌స్తుంది. ఇంతా చేస్తే సాహో ద‌ర్శ‌కుడికి ఉన్న అనుభ‌వం ఒక్క సినిమా.. తొలి సినిమా బ‌డ్జెట్ 6 కోట్లు..! అలాంటి కుర్ర ద‌ర్శ‌కున్ని న‌మ్మి ఇప్పుడు 200 కోట్లు పెడుతున్నారు యువీ క్రియేష‌న్స్. ఈ సినిమాపై ఇప్పుడు ఇండియా మొత్తం చ‌ర్చ న‌డుస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ తో సినిమా అంటే ఏ ద‌ర్శ‌కుడికైనా క‌త్తి మీద సామే. పైగా రాజ‌మౌళితో సినిమా చేసిన‌ త‌ర్వాత హీరోల‌కు విజ‌యం రాదు అనే సెంటిమెంట్ ఉంది. అయినా కూడా ధైర్యంగా ముందుడుగేస్తున్నాడు సుజీత్. బాహుబ‌లి వెన‌క కేవ‌లం ప్ర‌భాస్ మాత్ర‌మే కాదు.. రాజ‌ముద్ర కూడా ఉంది.
ఇంకా మాట్లాడితే రాజ‌మౌళి ఉన్నాడు కాబ‌ట్టే బాహుబ‌లి సినిమాకు అంత పేరు.. అంత క్రేజ్.. అంత మార్కెట్.. అన్ని వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్లు. రాజ‌మౌళి ముద్ర తీసేస్తే బాహుబ‌లి సినిమాకు నిజంగా ఇంత క్రేజ్ వ‌చ్చేదా అంటే స‌మాధానం చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. బాహుబ‌లి అంటే విజువ‌ల్ వండ‌ర్ కాబ‌ట్టి అన్ని ఇండ‌స్ట్రీల్లో ఆస‌క్తిగా చూస్తున్నారు. అలా అని అన్ని సినిమాలు బాహుబ‌లి కావు క‌దా..! బాహుబ‌లితో వ‌చ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు సాహోను కూడా 250 కోట్ల‌తో నిర్మిస్తున్నారు యువీ క్రియేష‌న్స్ సంస్థ‌. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తోన్న సాహో సినిమాను తెలుగు, త‌మిళ్ తో పాటు హిందీలోనూ తెర‌కెక్కిస్తున్నారు.
ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది.. కానీ బాహుబ‌లి విష‌యంలో రాజ‌మౌళి ఉన్నాడు కాబ‌ట్టి ఆయ‌న క్రేజ్ తో సినిమాకు అన్ని వంద‌ల కోట్లు వ‌చ్చాయి. మ‌రి ఇక్క‌డ ఎవ‌రు ఉన్నారు.. సుజీత్ తొలి సినిమా ర‌న్ రాజా ర‌న్ బ‌డ్జెట్ కేవ‌లం 6 కోట్లు.. వ‌చ్చిన వ‌సూళ్లు 14 కోట్లు. ఎంత క‌థ డిమాండ్ చేసింద‌నుకున్నా.. టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఇలాంటి కుర్ర ద‌ర్శ‌కుడికి 250 కోట్లు ఇవ్వ‌డం క‌రెక్టేనా అంటున్నారు విశ్లేష‌కులు. కానీ ప్ర‌భాస్ మాత్రం సుజీత్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ కుర్రాడు అద్భుతం చేస్తాడు చూస్కోండి అంటున్నాడు. దానికి త‌గ్గ‌ట్లే హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ తో ఏదో మాయ చేస్తున్నాడు సుజీత్. దుబాయ్ షెడ్యూల్ లో విడుద‌లైన ఫోటోలు చూస్తుంటే ఎవ‌రికైనా షాకే. ఈ షెడ్యూల్ లో ఏకంగా 37 కార్లు.. 5 ట్ర‌క్కుల్ని వాడారు.
వాట‌న్నింటినీ ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం క్ర‌ష్ చేసారు. బాహుబ‌లికి వ‌చ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ప్ర‌భాస్ పై ఇన్ని కోట్లు పెట్ట‌డం మంచిది కాదేమో అని హెచ్చ‌రిస్తున్నారు వాళ్లు. ర‌జినీకాంత్ లాంటి హీరోల‌కే అంత మార్కెట్ లేదు బాలీవుడ్ లో. బాహుబ‌లి అంటే స్పెష‌ల్ మూవీ కాబ‌ట్టి వ‌ర్క‌వుట్ అయింది గానీ.. అన్ని సినిమాల‌కు అలా వ‌ర్క‌వుట్ అవ్వాల‌నే రూల్ అయితే లేదు. అందుకే కాస్త ఆలోచించి ముందడుగేయ‌మంటున్నారు అభిమానులు కూడా. మ‌రోవైపు సుజీత్ మాత్రం యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో దుమ్ము లేపేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాలో చూడ‌ని ఓ హాలీవుడ్ సినిమాను చూపించ‌బోతున్నాడు. ఒక‌వేళ నిజంగానే సుజీత్ ఆ స్థాయిలో మ్యాజిక్ చేయ‌గ‌లిగితే రెండో సినిమాకే మ‌నోడు టాప్ డైరెక్ట‌ర్ అయిపోవ‌డం ఖాయం. చూడాలిక‌.. ప్ర‌భాస్ రేంజ్ ను ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి తీసుకెళ్తారో..!

More Related Stories