English   

వాల్మీకీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది 

 Varun Tej
2019-06-10 11:53:06

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా మూవీ వాల్మీకి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి నటిస్తున్నాడు. ఆయన ఈ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమవుతున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా జిగర్తాండ సినిమాకి ఇది రీమేక్. పేట సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో వాల్మీ’ పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా జరుగుతుండగానే ఈ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో రకరకాల ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని సినియా యూనిట్ నే ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఆ విషయాన్ని పేర్కొంటూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది సినిమా యూనిట్. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ మీద రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. 

More Related Stories