English   

ప్రముఖ నటుడు ఆకస్మిక మృతి

 Girish Karnad
2019-06-10 12:34:55

ప్రముఖ కన్నడ రచయిత, నటుడు అయిన గిరీష్ కర్నాడ్ ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు వంటి సినిమాలతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యం బాధ పడుతున్న ఆయన ఈరోజు ఉదయం మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ వలన ఆరు గంటల ముప్పై నిముషాలకి కన్నుమూశారు. నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి నాటకసాహిత్యవేత్త ఈయనే. కర్నాడ్ మొదట నాటక నటుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికి తన అసమానప్రతిభతో ఒక్కొక్కమెట్టును అధికమిస్తూ ఒక ఉత్తమ భారత నాటక సాహిత్యవేత్తగా జ్ఞాన్ పీట్ అవార్డ్ సాధించారు. ఆయన మృతి పట్ల కన్నడ సాహిత్య రంగం, సినీ రంగం సంతాపం ప్రకటించింది.

More Related Stories