English   

ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్‌లో సందడి చేసిన మహేష్

Mahesh Babu
2019-06-10 12:57:44

సౌత్ ఆఫ్రికాపై మొదటి విజయంతో ప్రపంచ కప్‌లో శుభారంభం చేసిన ఊపు మీదున్న టీమిండియా ఈరోజు  ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌ కొద్ది సేపటి క్రితమే ప్రారంభం కాగా ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు కొడుకు గౌతమ్‌, మొన్న హిట్ ఇచ్చిన మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి వెళ్ళాడు  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మహర్షి హిట్ తో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌లో ఉన్నారు. మొన్ననే జెర్మనీ ట్రిప్ ముగించుకుని ఇటలీ వెళ్ళిన ఆయన ఈ రోజు మ్యాచ్ కోసమే అక్కడికి వెళ్ళాడు. ఇక ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.  ఇక వెకేషన్ అయ్యాక మహేష్ అనీల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూట్ లో పాల్గొంటారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మికా మందనా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో విజయశాంతి, బండ్ల గణేష్ మళ్ళీ నటనా రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

More Related Stories