English   

బాలయ్య బర్త్ డే... తదుపరి సినిమా మీద క్లారిటీ

Balakrishna
2019-06-10 13:16:28

తన తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు నాట తిరుగులేని హీరోగా ఎదిగిన నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కు తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం సినిమాలో బాలకృష్ణ నటించగా ఆ సమయంలో బాలకృష్ణ నటనను చూసి ‘సింహం కడుపున సింహమే పుట్టింది’ అని ఏఎన్నార్‌ అన్నారట. అవును నిజమే సింహం అనగానే మనకు గుర్తొచ్చేది నందమూరి నటసింహమే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్‌ సినిమాలతో తన నట విశ్వరూపాన్ని చూపారు. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. జానపదం, ఫ్యాక్షన్‌, యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు బాలయ్య. బాలయ్య డైలాగ్‌లు చెపుతూ ఉంటే అభిమానులకైతే పూనకాలే. సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడో ఒక సారి ఆయన డైలాగ్స్ వాడుతూ ఉంటారంటే ఆయన చలవే.  ఇక ఆయన 59వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించే తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 105వ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ నిర్మించనున్నారని ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, బాలయ్యకు పత్రికా ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.  

More Related Stories