English   

సోషల్ మీడియాలో విలన్ అవుతున్న విజయ్ దేవరకొండ 

 Vijay Devarakonda
2019-06-10 13:30:05

విజయ్ దేవరకొండ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆయన్ని వెతుక్కుంటూ మరి కాంట్రవర్సీలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో విలన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అది కూడా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ విషయంలోనే, ఇంతకీ విషయం ఏంటంటే ఆనంద్ దొరసాని సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు, ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది అయితే ఈ సినిమా గురించి పబ్లిసిటీ గాని టీజర్ ను షేర్ చేయడం కానీ ఇంతవరకు చేయలేదు విజయ్ దేవరకొండ. తమ్ముడు సినిమా కూడా ఏమాత్రం ప్రమోషన్ చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు, అయితే తమ్ముడు సినిమా టీజర్ పట్టించుకోకుండా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైలర్ షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. దానికి తోడు ఆ హీరో గురించి కూడా ట్విట్టర్లో రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. దాంతో అక్కడే అసలు రచ్చ మొదలైంది తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న దొరసాని సినిమా టీజర్ గురించి ఎక్కడా రాయలేదు షేర్ చేయలేదు, విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా చేయడం లేదు. దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. తమ్ముడు సినిమాలు పట్టించుకోకుండా ఎవరో వేరే హీరో సినిమాను ప్రమోట్ చేస్తావా అంటూ విజయ్ దేవరకొండతో ఆడుకుంటున్నారు నెటిజన్లు.

More Related Stories