English   

కధకి తగిన టైటిల్ తో గోపీచంద్

 Chanakya
2019-06-10 16:55:03

ఒకప్పుడు ఏడాదికి ఒక హిట్ తో అయినా గోపీచంద్ ఫాంలో ఉండేవాడు. ఇక వరుస ఫ్లాప్ లతో డీలా పడిన ఆయన క్రేజ్ బాగా తగ్గింది. అలాంటి సమయంలో తమిళ దర్శకుడు తిరు రూపొందిస్తోన్న సినిమాలో గోపిచంద్ సరికొత్త లుక్ లో ఆయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మితమవుతున్న ఈ సినిమాకి సుంకర రామబ్రహ్మం, అనిల్ లు నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి చాణక్య‌ అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. నిజానికి ఈ సినిమాకి బంగారు బుల్లోడు అనే టైటిల్ పెడతారని నిన్న ప్రచారం జరిగింది కానీ అందుకు విరుద్దంగా ఈ రోజు చాణక్య పేరుతో టైటిల్ లోగోని సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో జరీన్ ఖాన్ కూడా కీలక పాత్రలో పోషిస్తోంది. ఆర్మీ నేపధ్యంలో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి క‌థ‌కు సూట్ అయ్యేలాహా చాణక్య‌ అనే పేరు పెట్టారని తెలుస్తోంది. మేలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గోపీ చాంద్ కి యాక్సిడెంట్ కావడం వలన ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర్లో రిలీజ్ కావడానికి సిద్దం చేస్తున్నారు. 

More Related Stories