English   

తనని ట్రోల్ చేస్తున్న వారికి సెటైరిక్ పోస్ట్ చేసిన సమీరారెడ్డి

 Sameera Reddy
2019-06-10 17:31:29

తెలుగు అమ్మాయి అయినా బాలీవుడ్ లో సెటిలయిన హీరోయిన్ సమీరా రెడ్డి. పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అయ్యింది సమీరా. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమెకి ఇప్పటికే ఒక బాబు జన్మించగా  సమీరా ఇప్పుడు రెండో సారి గర్భవతి అయ్యింది.  సినిమాల‌కు దూరంగా ఉన్న త‌ర్వాత ఈ మ‌ధ్య ఎప్పుడూ బ‌య‌టికి రాలేదు స‌మీరా రెడ్డి. ఇప్పుడు గర్భంతో మరో ఫోటో షూట్ చేసింది ఈ భామ. ఇక తాజాగా ఎనిమిదో నెల గ‌ర్భంతో ఉన్న స‌మీర‌ త‌న భ‌ర్త‌, పెద్ద కొడుకుతో క‌ల‌సి బేబీ మూన్ కోసం గోవా వెళ్లింది. అక్క‌డ ఉన్న బీచ్‌ లలో త‌న కొడుకు, భ‌ర్త‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్న ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫోటోల‌ మీద కొందరు నెటిజ‌న్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. నిండా గర్భిణీ గా ఉన్న నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఈ ఫోటో షూట్లు అని కొందరు నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడుతున్నారు. ఈ నెగటివ్ ట్రోల్లింగ్ వలన నొచ్చుకున్న ఆమె ఈ ట్రోలింగ్ చేసే బ్యాచ్ మీద కొట్టీ కొట్టనట్టు ఒక పోస్ట్ చేసింది. దీంతో మళ్ళీ త‌న బేబీ బంప్ ఫోటోల‌ను పోస్ట్ చేసి వారికి అర్ధం అయ్యీ కానట్టు కౌంటర్ ఇచ్చింది ఈ అమ్మడు. `ఎనిమిది నెల‌ల గ‌ర్భంతో ఉన్న నేను స‌ర‌దాగా ఉండ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న‌వారికి ఇదే నా స‌మాధానం` అని కర్ర విరక్కుండా పాము చావకుండా దెబ్బ కొట్టింది.

More Related Stories