English   

సెంచరీ కొట్టిన సల్మాన్...మూడు రోజుల్లోనే 

Salman Khan
2019-06-10 18:28:14

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా భారత్. అలీ అబ్బాస్ జాఫర్ దర్వకత్వం వహించిన ఈ సినిమా  ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారత్ మొదటి రోజే ఇక దేశవ్యాప్తంగా 4,700 థియేటర్స్ లో రిలీజయి 41.50 కోట్లు రాబట్టి తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. రెండో రోజున 31 కోట్లను .. మూడో రోజున 28 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ట్విట్టర్ ద్వారా సల్మాన్ ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక మరోపక్క స‌ల్మాన్, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న ఇన్షా అల్లా సినిమా కూడా రెడీ అయి వ‌చ్చే ఏడాది ఈద్‌కి విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ సినిమా డైరెక్టర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ.
 

More Related Stories