English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

Saaho
2019-06-10 19:19:42

బాహుబలి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమాతో ఇండియన్‌ సినిమా చరిత్రలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిస్తున్న సినిమా అది. ఇప్పటికే ఈ సినిమా యాక్షన్‌ సీన్స్‌ కు సంబంధించిన ప్రోమోలు సినిమా మీద అంచనాలు పెంచడంతో ఈ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులే కాకుండా సాధారణ సగటు సినీ ప్రేక్షకుడు ఎదరు చూస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ కానుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సాహో టీజర్‌ను విడుదల చేయబోతోంది చిత్రయూనిట్‌. జూన్‌ 13న ఈ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు 14నుంచి థియేటర్లలో దీన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యూవీ క్రియేషన్స్‌ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. శ్రద్దాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుజిత్‌ తెరకెక్కిస్తున్నాడు. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది.  

More Related Stories