English   

సుకుమార్ మెచ్చిన ఏజెంట్ 

Sukumar
2019-06-10 19:57:26

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నవీన్‌ పొలిశెట్టి హీరోగా కృతి శర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ. స్వరూప్‌ రాజ్‌ దర్శకత్వం వహిత్శున్న ఈ సినిమాని స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద మళ్ళీ రావా సినిమా తెరకెక్కించిన రాహుల్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చేశారు. ఈ మూవీలో ఆయన హీరో నవీన్ పోలిశెట్టి పై ప్రశంసల వర్షం కురిపించారు. నవీన్ పోలిశెట్టి కి తనకు ఓ కామన్ పాయింట్ ఉందని తామిద్దరం ఇంజనీరింగ్ చేశామని, అతను హీరో కావలననుకుంటే తాను, డైరెక్టర్ కావలననుకున్నానని అలా అనుకున్నందుకు తండ్రుల దగ్గర తిట్లు తిన్నామని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్రైలర్ చూసి డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రసంశల వర్షం కురిపించాడు. నవీన్ ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఉన్నానని, నీ కల నిజమయినందుకు కంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా కోసం ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అంతేకాక నీ కళ అద్భుతం అని, ఖచ్చితంగా నువ్వు విజయం అందుకుని తీరతావని అయన పేర్కొన్నారు. 
 

More Related Stories