English   

తమిళ కమెడియన్ ఆకస్మిక మృతి

Crazy Mohan
2019-06-10 20:18:01

ప్రముఖ తమిళ హాస్య నటుడు, రచయితా అయిన క్రేజీ మోహన్ కన్నుమూశారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలిన క్రేజీ మోహన్‌ను హుటాహుటిన గురైన ఆయన్ని వైద్య చికిత్స కోసం కావేరి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈనేపధ్యంలో మధ్యాహ్నం 2 గం.లకు ఆయన తుది శ్వాస విడిచారు. క్రేజీ మోహన్ మరణవార్తతో కోలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. క్రేజీ మోహన్ ఇక లేరన్న విషయాన్ని విన్న సినీ నటుడు సిద్దార్థ్, కమల్ హసన్ లాంటివాళ్ళు ఆయన ట్విట్టర్ ద్వారా సంతాపం వెలిబుచ్చుతున్నారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో క్రేజీ మోహన్ నాటక రచన చేసేవారు. తన సోదరుడు మధు బాలాజీ నిర్వహించే నాటక కంపెనీకి క్రేజీ మోహన్ స్క్రిప్ట్ రైటర్ గా పని చేశారు.  దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పొయ్ కల్ కుదరై’ సినిమాతో నటుడిగా ఆయన కెరీర్ మొదలైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆయన నటించారు. విచిత్ర సహోదరులు, మైఖేల్ మదన కామరాజ్, భామనే సత్య భామనే, తెనాలి, పంచతంత్రం, వసూల్ రాజా ఎంబీబీఎస్ మొదలైన చిత్రాల్లో ఆయన నటించారు. కమలహాసన్ కు క్రేజీ మోహన్ చాల సన్నిహితులు.

More Related Stories