English   

స్టార్ హీరో సినిమా కోసం కాజల్ ఐటెం సాంగ్

kajal
2019-06-10 20:20:08

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులో రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసి ప్రకటించింది సినిమా యూనిట్. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కి చాలా ముఖ్యమైనది కావడంతో సినిమా మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న త్రివిక్రమ్ ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం ఒక ఊపు తెచ్చే ఐటమ్ సాంగ్ వుండాలని ప్లాన్ చేశాడట. ఇక ఈ స్పెషల్ సాంగ్ కొస కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారని అంటున్నారు.  గతంలో కాజల్ ’జనతా గ్యారేజ్‘ సినిమాలో ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఎన్ టిఆర్ తో కలిసి ఆమె పక్కా లోకల్ అనే సాంగ్ తో సందడి చేశారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్స్ మీద ఈ సినిమాని సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఇక స్పెషల్ సాంగ్ కోసం కూడా కాజల్ కు భారీ పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై సినిమా యూనిట్ స్పష్టత ఇవ్వలేదు.  

 

More Related Stories