English   

ప్రియాంకను నెత్తిన పెట్టుకుంటోందిగా ?

rashmi
2019-06-10 22:16:58

ఈమధ్య జబర్దస్త్ ప్రోగ్రాం తో పాటు బయటి విషయాలపై కూడా బాగానే కాన్సెంట్రేట్ చేస్తుంది రష్మి గౌతమ్. ఎక్కడలేని సమస్యలు మొత్తం తీసుకొచ్చి తన తలపైన వేసుకుంతోంది ఈ ముద్దుగుమ్మ. దానికి సామాజిక బాధ్యత అనే పేరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే పుల్వామా అటాక్స్ నుండి రష్మి గౌతమ్ లో రెండో కోణం కనిపిస్తుంది తనకు సమాజంపై ఎంత బాధ్యత ఉందో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. దానికి తోడు అమ్మాయిలపై ఎవరైనా కామెంట్ చేస్తే అసలు తట్టుకోలేదు రష్మి వెంటనే వాళ్లకు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా విషయంలో కూడా ఇదే చేసింది ఈ జబర్దస్త్ యాంకర్. బ్లౌజు లేకుండా చీర కట్టుకొని ప్రియాంక చోప్రా ఈ మధ్యే ఒక హాట్ ఫోటోషూట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ప్రియాంక చోప్రా ఇండియా పరువు తీసింది అంటూ ఆమె పై మండి పడుతున్నారు. జాకెట్ లేకుండా చీర కట్టుకొని ఇండియా అంటూ ఈ ముద్దుగుమ్మ నిప్పుల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. హాలీవుడ్ వెళ్లినంత మాత్రాన భారతదేశ సంస్కృతి మర్చిపోతున్నారు, ఇలాంటి సందర్భంలో ప్రియాంక చోప్రా తప్పేమీ లేదు అంటూ ఒక జాతీయ మీడియా ఆమెకు సపోర్ట్ గా ఒక ఆర్టికల్ రాసింది, దానిని తన సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ రష్మి గౌతమ్ సపోర్టు చేసింది ప్రియాంక చోప్రా చేసిన దాంట్లో తప్పేముంది ఆమె బ్లౌజు లేకుండా చీర కట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఉంది అయినా కూడా అమ్మాయిల వస్త్రధారణ పై కామెంట్స్ చేయకూడదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ నెటిజన్ల పై ఫైర్ అవుతుంది రష్మి గౌతమ్. ఏదేమైనా ప్రియాంక చోప్రకు సపోర్ట్ చేస్తూనే తన డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన వాళ్ళను కూడా ఓ రేంజులో ఆడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

 

More Related Stories