English   

ఈసారి బిగ్ బాస్ మరింత ప్రత్యేకం...ఎందుకంటే ?

biggboss
2019-06-10 22:30:01

బిగ్ బస్ తెలుగు కోసం టాప్ సెలబ్రిటీస్ సిద్ధం కాబోతున్నారు. అవును నిజమే, బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ లో ఎప్పుడూ చూడని విధంగా స్టార్స్ ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అయితే ఆ సెలెబ్రిటీలి ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా 14 మంది. అందులో చాలా వరకు పేరున్నవారే ఉండటం గమనార్హం. చాలా రోజులుగా హోస్ట్ పై ఉన్న అనుమానం కూడా ఇప్పుడు తీరిపోయింది. ఈ సీజన్ కోసం నాగార్జున బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా ఉండబోతున్నాడని తెలుస్తోంది. జూలై మధ్యలో బిగ్ బాస్ సీజన్ మొదలుకానుందట. తొలి రెండు సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ ని ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఎన్టీఆర్ నాని కంటే నాగార్జున ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడని స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది. దానికి కారణం మీలో ఎవరు కోటీశ్వరుడు సూపర్ హిట్ కావడమే. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తో పాటు, తెలుగు రాజకీయాల్లో నవ్వులు పూయిస్తున్న పాల్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు యాంకర్‌ ఉదయభాను నటి,యాంకర్‌ రష్మి, గాయకుడు హేమచంద్ర, జబర్ధస్త్‌ ఫేమ్‌ సుధాకర్‌, యాంకర్‌ లాస్య, యాంకర్‌ రవి, యూట్యూబ్‌ స్టార్‌ మహాతల్లి, వీ6 యాంకర్‌ సావిత్రి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. నిజంగానే వీళ్ళందరూ బిగ్బాస్ సీజన్ త్రీ లో ఉంటే బ్లాక్ బస్టర్ కావడం ఖాయం ఎందుకంటే ఎవరికి వాళ్లే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న. వాళ్ళు ముఖ్యంగా యాంకర్ లాస్య,  రవి ఒకే ఇంట్లో అన్ని రోజులు కలిసి ఉంటే కచ్చితంగా బిగ్ బాస్ త్రీ పై అంచనాలు మరింత పెరిగి పోవడం ఖాయం. జబర్దస్త్ కమెడియన్ సుధాకర్, v6 తీన్మార్ వార్తలు సావిత్రి కూడా తెలంగాణలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇలా ఒకేసారి ఇంతమంది సెలబ్రిటీస్ ఒకే ఇంట్లో ఉంటే జరిగే రచ్చ మామూలుగా ఉండదు. మరి ఇంత మందితో కలిపి బిగ్బాస్ సీజన్ 3 ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

More Related Stories