English   

తేజ్ సినిమాకి సంక్రాంతి టైటిల్ మళ్ళీ మార్పు ?

sai
2019-06-10 22:55:08

వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమా హిట్ కొట్టడంతో రిలాక్స్ అయిన సాయి ధరమ్ తేజ్ అదే జోష్ కంటిన్యూ చేస్తూ యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో తేజ్ కొత్త సినిమా ఉండబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారని సంక్రాంతికి రిలీజ్ కానున్న్న ఈ సినిమాకి భోగి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ టైటిల్ కి ఎవరి దగ్గర నుండీ మంచి ఫీడ్ బ్యాక్ రాలేదని దాంతో సినిమా యూనిట్ మళ్ళీ బాగా ఆలోచించి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ముందు భోగి టైటిల్ విషయంలో అంతగా ఆసక్తి చూపని సాయిధరమ్ తేజ్ ఈ టైటిల్ విషయంల్ప్ మాత్రం దర్శక నిర్మాతలతో ఎకీభావిన్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో తేజ్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో కన్నా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా మాళవిక శర్మను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Related Stories