English   

మళ్ళీ తల్లి కానున్న శ్రియ

shriya
2019-06-11 07:35:24

అదేంటి ఒక్కసారి కూడా తల్లి కాని శ్రియ మళ్ళీ తల్లి కావడం ఏమిటని అనుకుంటున్నారా ? రియల్ గా కాదు లెండి,  సినిమాలో. నిజానికి శ్రియకు పిల్లలు లేరు కానీ సినిమా తల్లిగా నటించడానికి శ్రియ ఎప్పుడూ వెనుకాడలేదు. గతంలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి, గోపాల గోపాల సినిమాల్లో ఇద్దరేసి పిల్లలకు తల్లిగా నటించి మెప్పించిన శ్రియ ఇప్పుడు మరోసారి తల్లి పాత్రలో నటించడానికి శ్రియ సిద్ధమవుతున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఐతే సినిమాతో మొదలు పెట్టి అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మనమంతా సినిమా దెబ్బకి ఇప్పటికీ మరో సినిమా చేయలేదు. ఆయనతో గోపీచంద్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా ఇప్పటికే ఫ్లాప్లలో ఉన్న అయన మరో సాహసం చేసే స్థితిలో లేడు. ఈ మధ్యనే నితిన్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి నితిన్ కి చాలా సమయం పడుతుండడంతో ఆ గ్యాప్ లో ఏదో ఒక సినిమా చేయాలని భావించిన యేలేటి శ్రియకు ఓ లేడీ ఓరియెంటెడ్ కథ చెప్పారట. ఓ పదేళ్ల కుమార్తె, ఆమె తల్లి చుట్టూ కథ తిరుగుతుందట. స్క్రిప్ట్ నచ్చడంతో పదేళ్ల కుమార్తెకు తల్లిగా నటించడానికి శ్రియ అంగీకరించారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. నిజానికి ఈయన సినిమాల్లో అనుకోకుండా ఒక రోజు లేడీ సబ్జెక్ట్ నే, చార్మీతో చేసిన ఈ సినిమా అప్పట్లో బాగానే ఆడింది. మరి ఇప్పుడు ఏమవుతుందో ? వేచి చూడాలి మరి.

 

More Related Stories