English   

సూపర్ స్టార్స్ మీద కట్టప్ప అనుచిత వ్యాఖ్యలు

rajini
2019-06-11 07:52:28

తమిళ రాజకీయాలు ఎంతకీ అంతుపట్టవు, అక్కడి జనం ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో ఎవరిని పాతాళానికి తోక్కేస్తారో ఒక పట్టాన అవగాహానకి రాలేము, నిజానికి అప్పటి ఎమ్జీఆర్ నుండి మొన్నటి జయలలిత వరకూ గుండెల్ల్లో పెట్టుకున్నారు. అదే సమయంలో కెప్టెన్ విజయ్ కాంత్ లాంటి వాళ్ళు వస్తే అసలు పట్టించుకోలేదు. ఇక మిగిలింది ఇద్దరు, ఒకరు దక్షినాది సూపర్ స్టార్ రజనీ కాంత్ కాగా, మరొకరు లోక నాయకుడు కమల్ హసన్. వీరిలో రజనీకాంత్ గత కొద్దికాలంగా రాజకీయాల్లోకి వస్తానంటు ఫీలర్స్ వదులుతున్నారే తప్ప దిగడం లేదు. ఇక పార్టీ పెట్టినా జనాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు కమలహాసన్‌. తాజాగా వీరిద్ద్దరి మీదా సంచనల వ్యాఖ్యలు చేశారు తమిళ నటుడు సత్యరాజ్ అదేనండీ మన కట్టప్ప. ఈ మధ్య కాలంలో తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందంటూ రజనీ చేయక చేయక ఓ రాజకీయ వ్యాఖ్య చేస్తే ఆ వ్యాఖ్య మీద సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని ఓటర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిరూపించారని, స్టాలిన్ సమర్ధుడు అని ప్రజలు నమ్మారని అన్నాడు. అలాగే కొత్తగా పెట్టె పార్టీల వల్ల ఏ ప్రయోజనం, మార్పు ఉండదని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ ని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ఇక డీఎంకే వంటి సంస్థాగత పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమేనని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని విమర్శించారు. స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదని రజనీకాంత్ స్థానికతను దృష్టిలో పెట్టుకుని సత్యరాజ్ వ్యాఖ్యానించారని అంటున్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ మరాఠీ వ్యక్తి అని తెలిసిందే. 

More Related Stories