English   

కొరియోగ్రాఫర్ తో శర్వానంద్ సినిమా ?

sharwanad
2019-06-11 09:16:03

సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం మళ్ళీ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు సినీ పండితులు. నిజానికి ఈయన ప‌దేళ్ల‌ క్రితమే ద‌ర్శ‌కుడిగా నీవ‌ల్లే నీవ‌ల్లే తమిళ్ లో ఏగ‌న్‌ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తా ప‌డింది. దీంతో ఆయన తర్వాత మరే సినిమాకి దర్శకత్వం చేయలేదు, చేసే ప్రయత్నం కూడా చేయలేదు, చాన్నాళ్ళహా ఆయన కొరియోగ్రాఫ‌ర్‌గానే బిజీగా ఉన్నారు. అయితే మ‌ళ్లీ ఆయ‌న మెగాఫోన్ ప‌ట్టాల‌నుకుని ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. ఇక ఆ కధతో ఇటీవ‌ల యంగ్ హీరో శ‌ర్వానంద్ ని కలిసి స్టోరి లైన్ కూడా చెప్పాడ‌ట‌. లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్టు పూర్తి అయ్యాక వ‌చ్చి మ‌రోసారి క‌ల‌వ‌మ‌న్నాడ‌ట, పూర్తి స్క్రిప్ట్ చూసి త‌న నిర్ణ‌యం చెబుతాన‌ని శ‌ర్వానంద్ చెప్ప‌డంతో, రాజు సుంద‌రం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో తలమునకలు అయ్యారట. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జ‌రిగితే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఈ సినిమా ఈ ఏడాది ఆఖరున మొద‌ల‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. అనిల్ సుంకర ఈ సినిమాని ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద నిర్మించనున్నాడు. చూడాలి ఈసారైనా రాజు సుంద‌రం మాస్ట‌ర్ స‌క్సెస్ కొడ‌తాడెమో.  

More Related Stories