English   

బాలయ్య సినిమా టైటిల్ అదేనా ?

Balakrishna
2019-06-11 14:02:17

ఏడాది తన తండ్రి దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను బయోపిక్ గా తెరకెక్కించాడు నందమూరి బాలకృష్ణ. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన రెండు భాగాలు నిరాశ పరిచాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ హడావిడిలో పడిన ఆయన బోయపాటితో సినిమా చేయాలని భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ సినిమా వాయిదా పడిందని ప్రచారం జరిగింది. వెంటంటే కేఎస్ రవి కుమార్ తో మరో సినిమా ఉంటుందని ప్రచారం మొదలయ్యింది. అయితే నిన్న బాలయ్య పుట్టిన రోజు నాడు ఆ విషయం మీద క్లారిటీ వచ్చింది. నిజానికి రవి కుమార్ సినిమా కూడా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అందుకే నిన్న పుట్టినరోజు సందర్భంగా పేపర్ యాడ్ ఇచ్చి మరీ వార్త‌ల‌కు చెక్ పెట్టారు సినిమా యూనిట్. ఇక ఈ సినిమా ఎప్పటి నుండి మొదలవుతుంది అనేదాని మీద క్లారిటీ లేక పోయినా ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నట్టు సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకూ నిజం అనేది టీం క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.

More Related Stories