English   

సమంతా తల్లి కాబోతోందా ?....క్లారిటీ ఇచ్చేసింది ?

Samantha
2019-06-11 15:04:31

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పటికే పెళ్లి చేసుకుని ఒక ఇంటికి కోడలిగా వచ్చిన విషయం తెలిసిందే, తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని చెప్పే అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగ్ కుమారుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపొయింది సామ్. ఆమె పెళ్లి అయి రెండేళ్లు కావస్తున్నాయి. ఇక అమ్మాయి జీవితంలో పెళ్లి తర్వాత తల్లి కావడమే పీడా విషయం కావడంతో కొన్ని వెబ్ సైట్స్ ఆమె తల్లి కాబోతోందని ప్రచారం మొదలు పెట్టాయి. సమంత త్వరలో తల్లి కావాలనుకుంటుందని అందుకే వీలయినంత త్వరలో తన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు రెండ్రోజుల నుండి కొన్ని వేస్ సైట్స్ ద్వారా ప్రచారం జరుగుతోంది. ఇక తన తాజా సినిమా ఓ బేబీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ హడావిడిలో ఉన్న ఆమెకు ఈ ప్రచారం చికాకు తెప్పించినట్టుంది. దీంతో ఆమె ఈ వార్త‌ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. `స‌మంత త‌ల్లి కాబోతోందా?` అంటూ ఓ వెబ్‌సైట్ రాసిన వార్త‌ను రీట్వీట్ చేసిన స‌మంత `అవునా? ఆమె త‌ల్లి కాబోతోందా? ఈ విష‌యం మీకెప్పుడు తెలిసిందో మాకు కాస్త‌ చెప్పండి` సెటైరికల్ గా కామెంట్ చేసింది. దీంతో సమంత ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏవీ చేయట్లేదని తేటతెల్లమైంది. నిజానికి ట్విట్టర్‌లో సమంత అక్కినేని పేరుని ఆమె బేబి అక్కినేనిగా మార్చుకోవడం వలన కొంత ఈ ప్రచారానికి ఊతం ఇచ్చి ఉండచ్చు, కానీ ఓ బేబీ సినిమాలో సమంతా పేరు బేబక్క కావడంతో ఈ పేరు మార్చుకుంది ఆమె. కానీ ఈ గాసిప్ రాయుళ్ళకి మరోలా అర్ధం అయినట్టు ఉంది.  

More Related Stories