English   

స్టార్ హీరో సోదరికి వింత జబ్బు 

Sunaina Roshan
2019-06-11 15:38:21

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కుటుంబాన్ని అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది మొదట్లో నటుడు, నిర్మాత, దర్శకుడు రాకేశ్‌ రోషన్‌కు గొంతు కాన్సర్‌ కోసం ఆపరేషన్ చేయగా ఆయన కాస్త కోలుకున్నాడు. ఈ నేపధ్యంలో హృతిక్ సోదరి సునైనా రోషన్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తేలింది. చాన్నాళ్ళగా బాధ పడుతున్న ఆమె ఇప్పుడు వ్యాధి ముదరడంతో వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె బాధ పడుతున్న మానసిక వ్యాధి పేరు బైపోలార్ డిజాస్టర్. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో రోషన్ కుటుంబం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కాగా 2018లో సునైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. నిజానికి ఈమె కూడా ఒకసారి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె కొన్నేళ్ల క్రితం సర్వికల్‌ క్యాన్సర్‌ తో బాధపడ్డారు. ఇదొక సైలెంట్‌ క్యాన్సర్‌ అనే చెప్పాలి, నిజానికి వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. ఎలాగో దాని నుండి బయటపడ్డ ఆమె మళ్ళీ బైపోలార్ డిజాస్టర్ బారిన పడింది. నిజానికి ఈ డిజార్దర్ తో బాధపడుతున్న వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఉన్మాదుల్లాగా కూడా ప్రవర్తిస్తారు. ఇక ఆమె రెండు వివాహాలు విఫలం అయ్యాయి. చివరికి ఆమె భరత్ టాకూర్ అనే ఆర్కిటెక్ట్ ప్రేమలో పడ్డారు, అయితే అది వివాహం దాకా వెళ్ళలేదు.

More Related Stories