English   

కల్కికి పోటీగా బ్రోచెవారెవరురా 

kalki
2019-06-12 07:26:04

శ్రీవిష్ణు, నివేదా థామస్‌, సత్యదేవ్, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా బ్రోచేవారెవ‌రురా. మెంటల్ మదిలో సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, శ్రీ విష్ణు కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో సినిమా ఇది. చ‌ల‌న‌మే చిత్రము చిత్రమే చ‌ల‌న‌ము అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమా జూన్ 28న విడుద‌ల కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెంటల్ మదిలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి మరో వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూ రిలీజ్ కి దగ్గరవుతోంది. త్వరలోనే ఈ సినిమా  ట్రైల‌ర్, ఆడియో రిలీజ్ వివరాలను కూడా త్వర‌లోనే నిర్మాత ప్రక‌టించ‌నున్నారు. ఇక మరోపక్క రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి సినిమా కూడా జూన్ 28నే విడుదలవుతోంది. ఇప్పుడు అదే రోజున ‘బ్రోచేవారెవరురా’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు పోటీపడనున్నాయి. 

More Related Stories