English   

నిర్మాతగా మారుతున్న మరో దర్శకుడు 

Bobby
2019-06-12 10:43:24

తెలుగులో చాలామంది దర్శకులు నిర్మాతలుగా మారిపోయారు. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక వాటిని అలా రెట్టింపు చేసుకునే పనిలో పడతారు. ఒక్కో సారి ఆ ప్రయత్నం తేడా కొట్టినా ప్రాసెస్ మాత్రం మారదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న రాజమౌళి,సుకుమార్,త్రివిక్రమ్ లాంటి చాలా మంది నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. ఈ కోవలోకి మరో దర్శకుడు చేరుతున్నాడు. ఆయనే బాబీ, పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ సినిమాలు తీశాడు. అందులో కాస్తో కూస్తో ఆడిన సినిమా అంటే జై లవ కుశ ఒక్కటే, ఇక ఆయన ప్రస్తుతం వెంకటేష్ నాగచైతన్య కాంబినేషన్లో వెంకీ మామ చేస్తున్నాడు. త్వరలోనే ఆయన నిర్మాతగా ఒక సినిమా చేయనున్నాడట. ఈ సినిమాకి సప్తగిరి ఎక్స్ప్రెస్, వజ్రకవచధర గోవింద సినిమాలని తెరకెక్కించిన అరుణ్ పవార్ దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. అందులో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తాడట. ప్రస్తుతం మారుతితో కలిసి సెట్స్ మీదకి వెళ్లడానికి తేజు సిద్ధమవుతున్నాడు. 'వెంకీమామ' సినిమాతో బాబీ బిజీగా వున్నాడు. ఈ రెండూ పూర్తయ్యాక బాబీ - తేజు -పవార్ కాంబినేషన్ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Related Stories