English   

ఆస్ట్రియా వెళ్తున్న సాహో...అందుకే 

Prabhas
2019-06-12 10:46:52

బాహుబ‌లి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే చిత్రాన్ని చేస్తున్నాడు. స్పై థ్రిల్ల‌ర్‌ గా గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్‌ లు యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి స్టార్స్‌ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ లో రేంజ్ లో చూపించడానికి హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ని పని చేయిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన 'పబ్' సెట్లో ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. అయితే ప్రభాస్ - శ్రద్ధా కపూర్ పై మరో రెండు డ్యూయెట్ లని షూట్ చేయాల్సి ఉంది. ఈ పాటలను ఆస్ట్రియా లోని కొన్ని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీమ్ అక్కడికి బయలుదేరనుందని చెబుతున్నారు. ఇక ఆ డ్యూయెట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తయాని అంటున్నారు. ఇక ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.  

More Related Stories