English   

అబ్బాయిలు కూడా పెళ్ళిచేసుకోవాలని రీల్ రాహుల్ వెంట పడుతున్నారు

Arjun Mathur
2019-06-12 12:37:41

బాలీవుడ్ నటుడు అర్జున్ మాథుర్ అంటే గబుక్కున గుర్తు పట్టడం కష్టం ఏమో కానీ "ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌" సినిమాలో, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాత్రలో నటించిన వ్యక్తి అంటే గుర్తు రావచ్చు. నిజానికి అమ్మాయిలు అందరూ మురిసిపోయే అందం ఆయనది. అయితే ఈ రాహుల్ పాత్ర తర్వాత ఆయనకి మంచి గుర్తింపే రాగా, ఆ తరువాత దరిద్రం కొద్దీ ఆయన "మేడ్‌ ఇన్‌ హెవెన్‌" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అందులో అర్జున్ ఓ స్వలింగ సంపర్కుడు అదే నండీ గే పాత్రను పోషించాడు. అంతే ఆ పాత్ర దెబ్బకి ఆయన సోషల్ మీడియా ఇన్బాక్స్ తన వర్గ నెటిజన్లు అదే నండీ గే స్ నుంచి వస్తున్న మెసేజ్ లతో నిండిపోతోందట. నిజంగానే ఆయన గే అనుకుని, గే అబ్బాయిల నుంచి చెప్పలేని విధంగా మెసేజ్ లు వస్తున్నాయని వారిలో ఎంతో మంది తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారని, తాను అటువంటి వాడిని కాదని చెప్పినా వారు వినడం లేదని అర్జున్ మాథుర్ మోర పెట్టుకుంటున్నాడు. ఇది నాణానికి ఒక వైపు అయితే మరో పక్క ఈ సిరీస్ చేసినందుకు ఆయన్ని ప్రశంసిస్తూ, ఈ సిరీస్ చూశాక తమలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందంటున్న స్వలింగ సంపర్కులు కూడా ఉన్నారని ఆయన చెబుతున్నారు.

More Related Stories