English   

నయనతార సినిమాకి కాపీ కష్టాలు...వాయిదా

Nayanthara
2019-06-12 12:52:34

ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాల మీద కాపీ ఆరోపణలు రావడం సర్వ సాధారణం అయ్యింది. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త సినిమా 'కోలైయుతీర్ కలాం' కూడా కాపీ చిక్కుల్లో పడింది. జూన్‌ 14న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు బిల్లా 2 ఫేం చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ భూమిక కూడా కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే రిలీజ్ కి దగ్గర వచ్చిన ఈ సినిమా మీద కోర్టు కేసు నమోదు అయ్యింది. తమిళ రచయిత సుజాతా రంగరాజన్‌ నవల 'కోలైయుతీర్ కలాం' ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు చెబుతున్నారు. అయితే ఈ  నవల హక్కుల్ని రూ.10 లక్షలతో సుజాతా రంగరాజన్‌ భార్య నుంచి కొనుగోలు చేశానని దర్శకుడు బాలాజీ కుమార్‌ ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాక దాని మీద ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఇలా తన దగ్గర ఉన్న హక్కులని బేస్ చేసుకుని సినిమా తీయడం అంటే కాపీ రైట్స్‌ను ఉల్లంఘించడమని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో తన మ్యాటర్ సెటిల్ అయ్యేదాకా నిర్మాతలు ఈ సినిమా విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని సదరు బాలాజీ కుమార్ కోర్టును కోరారు. నిన్న బాలాజీ పిటిషన్‌ ను విచారించిన కోర్టు సినిమా విడుదల మీద తాత్కాలిక స్టే ఇచ్చి జూన్‌ 21న చిత్ర నిర్మాతలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల నేపథ్యంలో ఈ చిత్రం వాయిదా పడింది.

More Related Stories