English   

హీరొయిన్ కి తండ్రి కాబోతున్న స్టార్ హీరో ?

Vijay Sethupathi
2019-06-12 13:45:24

మెగా మేనల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ సుకుమార్ అసిస్టంట్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఉప్పెన అనే చిత్రం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సముద్రం - జాలర్ల నేపథ్యంలో లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడని సినిమా యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పాత్ర గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ కి ఆయన తండ్రిగా నటించనున్నాడట. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఆరెక్స్ 100 హీరో కార్తికేయ చెప్పుకొచ్చాడు. హిప్పీ మూవీ ప్రమోషన్స్ టైమ్లో నాని సినిమాలో నెగటివ్ రోల్ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు, ఆయన ఉదాహరణకే చెప్పినా ఇప్పుడు అది న్యూస్ అయింది. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరొయిన్ గా న‌టిస్తోంది. హీరోయిన్ కృతి తండ్రి పాత్ర‌లోనే విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. తండ్రి పాత్రకి స్కోప్ ఎక్కువ ఉన్న నేప‌థ్యంలో విజ‌య్ ఈ పాత్ర‌కి అంగీకరించాడ‌ని చెబుతున్నా ఈ పాత్ర నెగటివ్ క్యారెక్టరైజేషన్ తో ఉంటుందా లేక పాజిటివ్ క్యారెక్టరైజేషన్ తో ఉంటుందా అనేదే తెలియలేదు.  

More Related Stories