English   

క్లాప్ కొట్టి మొదలెట్టేశారు 

 Aadhi Pinisetty
2019-06-12 14:17:39

ఓకే రకమైన ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న న‌టుడు ఆది పినిశెట్టి. ఒక‌వైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌ లు చేస్తూనే మ‌రోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అలా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆయ‌న ఓ స్పోర్ట్స్ డ్రామాలో లీడ్ రోల్ గా నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య దర్శకత్వలో తెరకెక్కనున్న ఒక స్పోర్ట్స్ మూవీలో నటించనున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయ్యింది. బై లింగ్యుయల్ మూవీగా తెరక్కనున్న ఈ సినిమా కొద్ది సేప‌టి క్రితమే హైదరబాద్ లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఇళ‌య‌రాజా తెలుగు వ‌ర్షెన్‌కి క్లాప్ కొట్టగా, నాని త‌మిళ వ‌ర్షెన్‌కి క్లాప్ కొట్టాడు. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ముఖ్య అతిధులుగా వచ్చిన బోయ‌పాటి శీను, గోపిచంద్ మలినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కి అందించారు. ఇక ఈ సినిమాకి క్లాప్ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మ‌రి కొద్ది రోజుల‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళ‌నుంది.

More Related Stories