English   

ఫిల్మ్ కాస్ట‌ర్స్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌కు చిరంజీవి సాయం

news casters
2019-06-12 15:12:29

ఇండ‌స్ట్రీలో ఉన్న ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌తో ఎప్పుడూ చ‌నువుగా ఉండే అతికొద్ది మంది హీరోల‌లో చిరంజీవి కూడా ఒక‌రు. ఈయ‌న ఎప్పుడూ ఇండ‌స్ట్రీ బాగు కోసం ఆలోచిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు మెగాస్టార్. తాజాగా ఈయ‌న చేసిన ఓ ప‌ని ఇండ‌స్ట్రీలో ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు మ‌రింత మంచి చేసింది. ఇండ‌స్ట్రీలో ఉన్న ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల బాగోగుల కోసం ఏర్పాటైన‌ అసోసియేష‌న్‌కు ఆర్థిక సాయం చేసాడు మెగాస్టార్. అన్న‌య్య చేసిన ఈ సాయానికి జ‌ర్న‌లిస్టులు కూడా ఆనందించారు. నిజానికి మార్చిలో జ‌రిగిన 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' సభ్యులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూష‌న్‌కే చిరంజీవిని ఆహ్వానించారు. అయితే అప్పుడు ఆయ‌న‌ 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన రాలేదు. కానీ ఎప్పుడూ దీనికి అండ‌గా ఉంటాన‌ని మాత్రం చెప్తూ వ‌చ్చారు చిరంజీవి. ఇప్పుడు అన్న‌ట్లుగానే అసోషియేష‌న్ కు త‌న‌దైన సాయం చేసాడు మెగాస్టార్. జర్నలిస్టుల సంక్షేమానికి  'ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన మెగాస్టార్.. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ప్ర‌త్యేకంగా త‌న ఇంటికి పిలిపించి అడ‌గ‌కుండానే తనవంతు సాయం చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సినిమా ప్రముఖులకు, ప్రేక్షకులకు టెలివిజన్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు వారధి లాంటివారు. ఈ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కృషి ప్రశంసనీయం. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం నాకు నచ్చింది. అలాగే, ఈ అసోసియేషన్ చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నావంతుగా కొంత సహాయం చేస్తున్నాను. నేను ఇచ్చిన మొత్తాన్ని హెల్త్ కార్డుల కోసం వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే, జర్నలిస్టులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను, మా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను" అని అన్నారు.

More Related Stories