English   

వేడి పుట్టిస్తున్న నడిగర్ సంఘం ఎన్నికలు 

Nadigar Sangam
2019-06-12 16:34:29

దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘం ఎన్నికలు తమిళ నాట రచ్చ రేపుతున్నాయి. ఎలా అయితే తెలుగు నాట మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మీడియా దాకా వెళ్లి హైలైట్ అయ్యయో అలగే తమిళ నాట కూడా ఈ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గత ఎన్నికల్లో శరత్ కుమార్ టీంతో పోటీ పడి గెలిచిన పాండవర్ అని టీం మళ్లీ బరిలోకి దిగింది. అయితే ఈసారి శరత్ బాబు టీం కాకుండా కొత్తగా దర్శక, నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పటుతుండటంతో ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. 23న జరిగనున్న ఈ ఎన్నికలకు ఏకంగా కోర్టు ప్రత్యేక రిటర్నింగ్ అధికారిని నియమించడంతో ఈ ఎన్నికల వేడి మొదలయ్యింది. నిజానికి విశాల్ టీమ్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా.. భాగ్యరాజా టీమ్ వారికంటే తాము నడిగర్ సంఘాన్బి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామంటూ బరిలో దిగారు. పాండవర్ టీమ్ నుండి అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తితోపాటు ఉపాధ్యక్ష, సభ్యులు ఇలా పాత టీం బరిలో ఉంది. గత కమిటీలో శరత్ కుమార్ టీమ్ మీద వ్యతిరేకతతో పాండవర్ టీమ్ కి మద్దతుగా నిలిచిన భాగ్యరాజా టీం ఈసారి పోటీకి దిగుతోంది.

More Related Stories