English   

సైలెంట్ గా స్టార్ట్ అవుతున్న భీష్మ 

Bheeshma
2019-06-12 17:54:29

హీరో నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపధ్యంలో ఈసారి ఎలా అయినా  సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇక అయన ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేయనున్నాడని చాల రోజుల క్రితమే ఆయనే ప్రకటించాడు. ఇక ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను కూడా అప్పుడే ఖరారు చేశారు. అయితే ఈరోజు చెప్పాపెట్టకుండా ఒకేసారి హీరోయిన్ రష్మికా మందన్నతో కలిసి ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టేసారు నితిన్. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన ఈ సినిమాని ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలయింది. ఇక ఈ సినిమా ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. సింగిల్ ఫర్ యువర్ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే ఇదేదో మంచి లవ్ స్టోరీలా అనిపిస్తోంది. అంటే భీష్ముడిలాగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకున్న యువకుడి జీవితంలోకి వచ్చిన ఒక భామ లవ్ లో ఎలా పడేసింది అనే కాన్సెప్ట్ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అని కూడా తొలుత ప్రచారం జరిగింది. సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నట్లు తెప్రచారం జరగగా ఆ విషయం మీద ఈరోజు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు యూనిట్. ఇక నితిన్ ఈ సినిమాతో నైనా హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి మరి.

More Related Stories