English   

చిరంజీవి చిన్నల్లుడికి సైబర్ వేధింపులు 

Kalyan Dev
2019-06-12 19:01:41

చిరంజీవి చిన్న కుమార్తెను వివాహం చేసుకున్న వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతో నటుడిగా ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అలంటి ఆయన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు, దేనికి అంట ఆయన మీద సోషల్ మీడియాలో అసభ్యకర వేధింపులు మొదలు కావడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, దాని ప్రకారం కొందరు ఆకతాయిలు ఇన్స్టా గ్రామ్ లో కళ్యాణ్ దేవ్ మీద అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఒక్కడినే కాక ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో కూడా వేధింపులు మొదలవడంతో  ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది మంది తనను ఇన్స్టాగ్రామ్ లో వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అదనపు డీసీపీ రఘువీర్ ఆయనని వేధిస్తున్న పది మందిని గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అకౌంట్ల వివరాల కోసం ఇన్స్టా గ్రామ్ కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇన్స్టా గ్రామ్ నుండి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

More Related Stories