English   

సాహో నుండి మరో అప్డేట్

saaho
2019-06-12 19:30:29

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు సాహో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ల జోరు కూడా పెంచారు. ఇదే క్రమంలో  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో టీజర్‌ ను రేపు ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్.. ‘సాహో’లోని సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఏదో చేజింగ్ సీన్ లా ఉన్న పోస్టర్ ని ప్రభాస్ షేర్ చేశారు. దీంతో పాటు టీజర్ విడుదల గురించి ప్రస్తావిస్తూ ‘‘ హే డార్లింగ్స్.. ఒకే ఒక్క రోజు ఉంది. ‘సాహో’తో ప్రపంచవ్యాప్తంగా రైడ్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?.’’ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు.  ఇక ఈ టీజర్  జూన్ 14నుండి థియేటర్స్‌లో కూడా చూడొచ్చు. టాకీ పార్ట్ షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, యూనిట్ త్వరలో సాంగ్స్ షూట్ కోసం ఆస్ట్రియా వెళ్లనుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది.

More Related Stories