English   

వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్.. హీరోకు తప్పిన ప్రమాదం..

varun
2019-06-12 20:32:28

మెగా అభిమానులకు పిడుగు లాంటి వార్త ఇది. నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయింది. వాల్మీకి సినిమా షూటింగ్ కోసం హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్ వెళ్తున్న ఆయ‌న కార్ వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట ద‌గ్గ‌ర ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డం అదృష్టం. అయితే కార్ మాత్రం బాగా ధ్వంసం అయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవ‌డంతో వ‌రుణ్ తేజ్ ప్రాణానికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. కొత్త‌కోట మండ‌లం రాయ‌నిపేట స్టేజీ ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం గురించి తెలియ‌గానే అంతా కంగారు ప‌డుతున్నారు. ముందున్న మ‌రో రెండు కార్ల‌ను ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తుంది. కార్ ధ్వంసమైనా కూడా హీరోకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌క్క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ స‌భ్యులు, అభిమానులు. ఎఫ్ 2 సినిమాతో ఈ మ‌ధ్యే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వ‌రుణ్ తేజ్. ప్ర‌స్తుతం వాల్మీకితో పాటు మ‌రో రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు ఈయ‌న‌.

More Related Stories