English   

సాహో టీజర్.. తెలుగు సినిమాకు హాలీవుడ్ కళ..

 Saaho
2019-06-13 12:46:56

బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ సినిమాలు కూడా మన సినిమాలను చూసి ఆహా అనుకుంటున్నాయి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే బాహుబలి తర్వాత మళ్లీ అదే రేంజ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈయన నటిస్తున్న సాహో సినిమా టీజర్ విడుదలయింది. ఇది చూస్తుంటే మనం తెలుగు సినిమా చూస్తున్నామా లేదంటే హాలీవుడ్ సినిమా కానీ తెలుగులో తీస్తున్నారా అనిపించకమానదు. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్సులు అలా ఉన్నాయి మరి. రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు సుజిత్ సాహో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 250 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు చేయించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు సాహో పై క్రేజ్ కూడా అలాగే ఉంది. మేకింగ్ వీడియోలతోనే నానా రచ్చ చేసిన ప్రభాస్ ఇప్పుడు టీజర్ తో ఏకంగా మైమరిపించే చేశాడు. ఈ ఒక్క టీజర్ చూపించి సినిమా బిజినెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. 

అంతగా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ యాక్షన్ యాక్షన్ అంటూ వెళ్లిపోయింది సాహో టీజర్. పైగా చివర్లో ప్రభాస్ వేసిన పంచ్ డైలాగ్ కూడా అదిరిపోయింది. ఎవరు వీళ్లంతా ఇలా ఉన్నారు అంటే ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ చెప్పిన విధానం ఆకట్టుకుంది. మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి అంటే డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ సమాధానం చెప్తాడు ప్రభాస్. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. లవ్ స్టోరీగా మొదలై యాక్షన్ స్టోరీగా ముగిసింది సాహో టీజర్. అద్భుతమైన లొకేషన్స్.. అంతకు మించిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో సాహో అంచనాలు భారీగా పెంచేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కచ్చితంగా సాహో సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పడానికి సిద్ధమవుతున్నాడు ప్రభాస్. హిందీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే. అక్కడ 130 కోట్ల బిజినెస్ చేసింది సాహో. తమిళ మలయాళ తెలుగులో కలిపి మరో 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. ఈ సినిమా మరి సాహూ ప్రభాస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

More Related Stories