English   

దాసరి కొడుకు మిస్సింగ్...ఆమె పనేనా ?

 Dasari Narayana Rao
2019-06-13 15:37:00

ప్రముఖ దివంగత సినీదర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు మిస్సింగ్ అయినట్టు పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు మళ్ళీ తిరిగిరాలేదు. ఈ క్రమంలోనే ప్రభు కుటుంబీకులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాసరి ప్రభుకి ఆయన భార్య సుశీలకు అనేక వివాదాలున్నాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో 2008లో కూడా ఓసారి ఇలాగే కనిపించకుండా పోగా కొన్ని రోజులకి బయటకు వచ్చిన ఆయన  తన భార్య సుశీలే తనను కిడ్నాప్ చేయించిందని ఆరోపించారు. అయితే ఈ సుశీల నటుడు మంచు మోహన్ బాబుపై కూడా  సంచలన ఆరోపణలు చేశారు. దాసరి నారాయణ రావు ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం జరగలేదని ఆమె అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. దాసరి ఆస్తి పంపకాల్లో పెద్ద మనిషిగా ఉన్న మోహన్ బాబు రెండు, మూడు రోజుల్లో ఆస్తి పంచుతామని దాసరి కన్నుమూసిన తర్వాత చెప్పారని కానీ ఇప్పటివరకు ఆస్తి పంపకాలు జరగలేదని రెండు నెలల క్రితమే ఆమె ఆరోపణలు చేశారు. అయితే దాసరి ప్రభు, సుశీలలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక దాసరికి ఇద్దరు కుమారులు కాగా మరొకరు అయిన అరుణ్ ఈ మధ్యనే వైసీపీలో చేరి ఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేశారు.

More Related Stories