English   

బిగ్ బీ గొప్ప మనసు...మళ్ళీ చాటుకున్నారు 

 Amitabh Bachchan
2019-06-13 16:00:48

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మరో మారు తన ఉదారతను, గొప్ప మనసుని చాటుకున్నారు. అదేంటి అనుకుంటున్నారా ? గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతులను ఎంచుకుని మరీ వారి రుణాలకు బ్యాంకులకు చెల్లించారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే ఆయన మరికొందరు రైతులకి సహాయం చేస్తానని ఆయన ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే తాజాగా కొంత మంది అప్పులు తీర్చారు మెగా స్టార్. ప్రామిస్ చేసినట్లుగానే తన ప్రామిస్ నిలబెట్టుకున్నానని అమితాబ్ తన టంబ్లర్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన 2100 మంది రైతుల అప్పులు తీర్చారు. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుతో వన్ టైం సెటిల్ చేయగా మరికొందరిని తన ఇంటికి పిలిపించి కొడుకు అభిషేక్, కూతరు శ్వేతల చేతుల మీదుగా చెక్కులు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఆయన మరో ప్రామిస్ కూడా నెరవేర్చాల్సి ఉందని దేశం కోసం పుల్వామా దాడిలో మృతి చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను ఇంకా వారిని ఆదుకోవాల్సిన దాన్ని కూడా త్వరలో తీర్చుకుంటానని పేర్కొన్నారు.

More Related Stories