English   

రేపు సినిమా రిలీజ్...ఇంతలో టాలీవుడ్ డైరెక్టర్ కి హార్ట్ ఎటాక్ 

Raj Kiran
2019-06-13 16:14:35

టాలీవుడ్‌లో గీతాంజ‌లి, త్రిపుర‌, ల‌క్కున్నోడు వంటి సినిమాలని తెర‌కెక్కించిన దర్శకుడు రాజ్ కిర‌ణ్‌ కి మైనర్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన నందితా లీడ్ రోల్ చేసిన విశ్వామిత్ర అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రేపు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆయనకీ ఈ ఉదయం స్వ‌ల్పంగా గుండెపోటు రావ‌డంతో ఆయ‌న్ని వెంట‌నే కూక‌ట్ ప‌ల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారని సమాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని వైద్యుల నుండి అందుతున్న సమాచారం. నిజానికి రేపు రిలీజ్ కానున్న సినిమా రిలీజ్ కి సిద్దమయిందనే విషయమే చాలా మందికి తేలేక పోవడం, రేపు సినిమాల విషయంలో పోటీ ఉండడం ఈ సినిమా మీద సరయిన అంచనాలు లేకుండా పోవడం, దానికి తోడు థియేటర్ లు కూడా సరిగ్గా దొరకకపోవడంతో ఆయన కాస్త టెన్షన్ గా ఉన్నట్టు సమాచారం. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుండటం వల్ల ఆయన స్వల్ప గుండెపోటు కి లోనయ్యాడని అంటున్నారు. మ‌రో రెండు రోజుల‌లో ఆయ‌న‌ని డిశ్చార్జ్ చేయ‌నున్నార‌ని చెబుతున్నారు.  

More Related Stories