English   

సాహో కోసం ముందుకు వెళ్తున్న నాగ్ ?

 Manmadhudu 2
2019-06-13 16:29:42

నాగార్జున సరయిన హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఈ మధ్యన వచ్చిన నమో వేంకటేశ, ఆఫీసర్, దేవదాస్ ఇలా అన్ని సినిమాలు నిరాశ పరచగా ఆయన ఆశలు అన్నీ మన్మధుడు సీక్వెల్ గా వస్తోన్న మన్మధుడు 2 మీదనే పెట్టుకున్నాడు. సూపర్ హిట్ అయిన మన్మధుడు సీక్వెల్ సినిమా అనగానే అంచనాలు భారీగానే నలకోన్నాయి. ఈ సినిమాను నటుడు, చిలసౌ సినిమాతో దర్శకుడుగా మారిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ లు నటించనుండగా కీలక పాత్రలలో సమంత, అనుష్కలు కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు అంటున్నారు. అయితే ఈ సినిమాని ముందుగా దసరాకు విడుదల చేయలాని అనుకున్నా ఇప్పుడు దానిని చాలా ముందుకు జరిపారని అంటున్నారు. ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి యూనిట్ భావిస్తోందని సమాచారం. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన ప్రభాస్ 'సాహో' భారీ స్థాయిలో విడుదల కానుంది. అందుకే ఒక వారం ముందుగా ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. నిజానికి సాహో లాంటి క్రేజ్ ఉన్న సినిమా రులీజ్ కి ముందు కూడా నాగ్ తన సినిమా విడుదల పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు. అయినా నాగ్ కథ మీదున్న నమ్మకంతో ఆగస్టు 9నే రావాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఇక ఈరోజు సాహో టీజర్ ను విడుదల చేస్తుండగా దానితో పాటే మన్మథుడు 2 టీజర్ ను కూడా వదలనున్నారు. పోటీ ఇప్పటి నుండే మొదలయిందన్న మాట. 
 

More Related Stories